12 August, 2026 | 2:44 AM

వర్షార్పణం!

12-08-2026 12:00 AM

రుతు పవనాలయినా, పార్లమెంటు సమావేశాలయినా క్రియాశీలంగా వుంటేనే అవి ప్రయోజనకరంగా వుంటాయని పార్లమెం టు వర్షాకాల సమావేశాల ప్రారంభంలో ప్రధాని నరంద్ర మోదీ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఈ ఏడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలయ్యేటప్పటికే నీట్ ప్రశ్నాపత్రాల లీక్ దేశాన్ని కుదిపేస్తున్నది. రోడ్లెక్కిన యువత, విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేశారు. దేశవ్యాప్త ఆందోళనలన్నీ కలిసి ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద సంగమంలా మారాయి. కాదు కూడదన్న అధికార బీజేపీ తలవంచక తప్పలేదు. జూలై 20న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో జెన్ జీ డిమాండ్‌ను ప్రతిపక్షాలు అందిపుచ్చుకున్నాయి.

సమావేశాలు స్తం భించడాన్ని అపాలంటే, ప్రధాన్‌తో రాజీనామా చేయించడమొక్కటే మార్గం గా అధికార పక్షానికి తోచింది. ప్రధాన్ రాజీనామా చేశారు. అంతటితో పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగలేదు. పార్లమెంట్ భవనం వైపు దూసుకొచ్చిన విద్యార్థులపై లాఠీచార్జితోబాటు పెల్లెట్లు పేల్చాల్సిందిగా ఎవరు ఆదేశాలిచ్చారనేది అంశంగా కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాలు హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకున్నాయి. నీట్ పరీక్ష పత్రాల లీక్, తదనంతర పరిణామాలపై ఆత్మరక్షణలో పడిన బీజేపీకి ఒక్కసారిగా తలవంపులు ఎదురయ్యాయి. ఇటు ప్రధాని, అటు హోంమంత్రి పార్లమెంటు సమా వేశాలకు దూరమయ్యారు.

అమిత్‌షా లోక్ సభలో ప్రకటన చేయాలని, విద్యార్థులపై దమనకాండకు ఆదేశాలిచ్చింది ఎవరో చెప్పాలని ప్రతిపక్షం పట్టుబిగించింది. నీట్ పేపర్ల లీక్‌తోబాటు, అయోధ్య రామమందిర విరాళాల అంశం కూడా ప్రతిపక్షం చేతిలో అస్త్రమైంది. ఇంకా రెండు రోజుల్లో శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. దేశంలో రుతుపవనాలు ఆలస్యంగానైనా క్రియాశీలంగా మారాయి. బీజేపీపై ధ్వజమెత్తేందుకు ప్రతిపక్షలన్నీ క్రియాశీలంగా మారాయి. మరి పంజాబ్, జార్ఖండ్‌లల్లోనూ పరీక్ష పేపర్లు లీకయ్యా యి కదా.. పెదవి విప్పరేం అని ఎన్డీఏ పక్షాలు కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగా యి. రాంచీలో విద్యార్థులపై లాఠీ ఝళిపించడం ఏమిటి అని బీజేపీ ప్రశ్నిస్తున్నది.

ఒక్క జంతర్‌మంతర్ ఘటనలే కాదు, అన్ని రాష్ట్రాల్లోని అంశాలనూ చర్చించాల్సిందేనని, ఆ తర్వాతే హోంమంత్రి సమాధానం చెబుతారని అధికారపక్షం పట్టుపడుతున్నది. ఈ సమావేశాల్లో నినాదాల మధ్యే కొన్ని బిల్లు లు ఆమోదం పొందినా, ఇరుపక్షాల పట్టుదలల మధ్య ఆగస్టు 13తో ముగిసే పార్లమెంటు సమావేశాలు ఉద్రిక్తతల నడుమ వర్షార్పణం కానున్నాయి.