03-05-2025 07:35:51 PM
ప్రియురాలికి పెళ్లయిన వారం రోజులకే పురుగుల మందు తాగిన ప్రేమ జంట...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): పురుగుల మందు తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంకు చెందిన రాజ్ కుమార్, ప్రవల్లికలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల అమ్మాయికి వారి కుటుంబీకులు వివాహం చేశారు. కానీ ప్రియున్ని మర్చిపోలేక, పెళ్లయిన వారం రోజులకే ప్రియుడు రాజ్ కుమార్ తో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ ఫ్యాక్టరీ సమీపంలో శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా రిమ్స్ కు వెళ్లి దర్యాప్తు చేసి, కేసు నమోదు చేసిన్నట్లు వన్ టౌన్ ఎస్ఐ అశోక్ తెలిపారు.