03-05-2025 07:31:30 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం వివాహ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని ఆర్తిదారులు, వ్యాపారస్తులు, నాయకులు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారి ఎండి షాబుద్దీన్, మార్కెట్ కార్యదర్శి ఎం రాజా హమాలీలు, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దొడ్డ శ్యాం కుమార్ నాయకులు అంబాల రాజు, వెంకటేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.