calender_icon.png 4 May, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదింటి ఆడబిడ్డకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

03-05-2025 07:44:39 PM

ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి..

కొండపాక: పేదింటి ఆడబిడ్డకు అండగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచిందని కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కొండపాక రైతు వేదికలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. పేద ప్రజలకు ఆర్థిక భారం పడకుండా ఉండడం కోసం హామీ ఇచ్చినట్టుగా పథకాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి, మండల ఆత్మ కమిటీ డైరెక్టర్లు వీరబ్రహ్మం, సరోజ శ్రీనివాస్, శ్రావణ్ తహసిల్దార్ దిలీప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.