1 April, 2026 | 5:45 AM

క్షేత్రపాలకుడికి ఆకుపూజ

15-05-2024 02:44 AM

యాదాద్రి భువనగిరి, మే 14 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రధానాలయ మండపంలోని ఆంజనేయస్వామికి సిందుర అభిషేకం జరిపారు. తమ లపాకుల మాలలతో ప్రత్యేక అలంకారం జరిపి, వడపప్పుబెల్లం, అరిసెలు నైవేద్యం సమర్పించారు. ఆలయ ఉత్సవ మండపంలో సుదర్శన హోమం నిర్వహించారు. శాస్త్రోక్తంగా వేదమంత్రాలతో నిత్యకల్యాణం చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మంగళవాయి ద్యాలు, వేదమంత్రాలతో తిరువీధుల్లో ఊరే గించారు. వెండిజోడిసేవలో భక్తులు పాల్గొ ని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

రూ. 31.29లక్షల ఆదాయం

స్వామివారికి మంగళవారం భక్తుల నుంచి రూ. 31,29,917 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్‌రావు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 2,01,094, కైంకర్యాల ద్వారా రూ. 5,201, సుప్రభాత దర్శనాల ద్వారా రూ. 23,300, బ్రేక్ దర్శనాల ద్వారా రూ. 2,44,800, వ్రత పూజల ద్వారా 91,200, వాహన పూజల ద్వారా రూ. 4,500, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 4,20,000, ప్రచార శాఖ 42,900, పాతగుట్ట ద్వారా రూ. 20,960, కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా రూ. 5,50,000, యాదరుషి నిలయం ద్వారా రూ. 1,03, 650, సువర్ణపుష్పార్చన ద్వారా రూ. 84, 916, శివాలయం రూ. 10,750, పుష్కరిణి రూ. 1400, ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 12,07,000, కల్యాణ కట్ట రూ. 66, 800, ఆలయ పునరుద్ధరణ నిధి 2,200, శాశ్విత పూజలు 15,000, లాకర్స్ రూ. 440, అన్నదానం రూ. 33,796 ఆదాయం వచ్చినట్టు తెలిపారు.