రినే హాస్పిటల్‌లో లక్కీ డ్రా
కరీంనగర్ క్రైమ్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): స్థానిక రెనీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో రజని సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి నటి నాగదుర్గ హాజరై మాట్లాడారు. సృష్టికి మూలం అమ్మ అని, ఆడతామో అందాల ఆనంద పౌర సమాజ నిర్మాత అని తెప్పాల్సిన పని లేదన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏటా ప్రత్యేక ఉచిత ఫర్టిలిటీ సేవలు పొందడానికి అర్హులైన 10 మందిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసుకొని లక్షల విలువైన ఆధునిక వైద్య సేవలను ఉచితంగా కల్పిస్తున్న రెనీ ఆసుపత్రి చైర్మన్ డా బంగారి స్వామి, డైరెక్టర్ డా రజనీ ప్రియదర్శిని దంపతులను ప్రశంసించారు. లక్కీడిప్ ద్వారా 10 మందిని ఎంపిక చేసారు. డా రజనీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. తమ అత్త గారి పేరిట ప్రతి ఏట 20 లక్షల విలువైన సంతాన ఫల్య ఉచిత సేవలు అందించడం చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు.
డా.బంగారి స్వామి మాట్లాడుతూ.. చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేర్చిన సమాజానికి ఎంతో రుణపడి ఉన్నామని, అందుకే ఏడాదికి 50 లక్షలకు పైగా ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. డా.రజ నీ ప్రియదర్శిని అన్న, ఎన్నారై అయిన పెద్దపల్లి రంజన్, వారి శ్రీమతి మీనా అదనంగా ఇంకో ముగ్గురు జంటలకు, ఇంకొక జంటకు ప్రొఫెసర్ డా.బంగారి స్వామి ఐవీఎఫ్ చికిత్సను అందించడానికి ముందుకొచ్చారు. మొత్తం 14 మంది దంపతులకు ఉచిత ఐవీఎఫ్ చికిత్స అవకాశంఇచ్చారు.
ముఖ్య అతిథి నాగదుర్గను ఆసుపత్రి యాజ మా న్యం ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాయత్రి, మానుకోండూర్ మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలత, మహిళాకార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, పెద్దపల్లి శ్రీలేఖ, సామాజిక సేవా ప్రతినిధుకైన మీనా రంజన్, శ్యామల, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా రవీంద్రారెడ్డి చారి, జనరల్ ఫిజీషియన్ డా.నిఖిల్ లక్ష్మణ్, డా .లతీష్‌రెడ్డి పాల్గొన్నారు.




