4 March, 2026 | 5:03 AM

హోలీపై చంద్రగ్రహణం ఎఫెక్ట్

04-03-2026 01:04 AM

రంగారెడ్డి, మార్చి 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల పండుగను జరుపుకుంటున్నారు.నిన్న రాత్రి ఆయా గ్రామాల్లో సంప్రదాయబద్ధంగా కాముని దహన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, పాటలతో, నృత్యాలతో ప్రజలు ఉత్సాహంగా గడిపారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

ఈ ఏడాది హోలీ వేడుకలపై చంద్రగ్రహణం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రహణం కారణంగా కొన్ని గ్రామాల్లో నిన్న జరగాల్సిన హోలీ వేడుకలను ఈరోజుకు వాయిదా వేసుకున్నారు. గ్రహణ సమయాన్ని పురస్కరించుకుని పలు ప్రముఖ ఆలయాలను అధికారులు మూసివేశారు. శుద్ధి కార్యక్రమాల అనంతరం తిరిగి ఆలయాలను తెరిచే అవకాశం ఉంది. పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో సామాన్య ప్రజల్లో కొంత సందిగ్ధం  నెలకొన్నప్పటికీ, మంగళవారం చాలా చోట్ల పండుగ వాతావరణం కనిపిస్తోంది.

సురంగల్ మున్సిపాలిటీలో..

మొయినాబాద్, మార్చి 3 (విజయ క్రాంతి): సురంగల్ మున్సిపాలిటీ పరిధిలో హోలీ పండుగను చిన్నారులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. గ్రామ వీధుల్లో రంగులు చల్లుకుంటూ, ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటూ చిన్నారులు ఉల్లాసంగా ఆడిపాడారు. సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగను జరుపుకుంటూ పిల్లలు హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

రంగుల సందడితో వీధులు కళకళలాడాయి. స్థానికులు కూడా చిన్నారుల ఆనందాన్ని ఆస్వాదిస్తూ పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దల పర్యవేక్షణలో వేడుకలు ప్రశాంతంగా సాగాయి. రంగుల పండుగగా పేరుగాంచిన హోలీ సందర్భంగా సురంగల్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.

శంకర్‌పల్లి..

శంకర్‌పల్లి, మార్చి 3 (విజయ క్రాంతి): శంకర్ పల్లి మండలంలోని గ్రామాలలో, మున్సిపల్ పరిధిలోని కాలనీలలో మంగళవారం హోలీ పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఉదయం 8 గంటల నుండే పెద్దలు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందించారు. అలాగే పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. హోలీ పండుగ ముందు ఆదివారం, సోమవారం వివిధ రాష్ట్రాల వారు కామ దహనాలు నిర్వహించారు.

శంకర్ పల్లి మండలంలోని గ్రామాలలో, మున్సిపల్ పరిధిలోని కాలనీలలో మంగళవారం హోలీ పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవా లతో జరుపుకున్నారు. ఉదయం 8 గంటల నుండే పెద్దలు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందించారు. అలాగే పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ పండుగ ముందు ఆదివారం, సోమవారం వివిధ రాష్ట్రాల వారు కామ దహనాలు నిర్వహించారు.