calender_icon.png 9 September, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాలపై చంద్రగ్రహణం ఎఫెక్ట్

08-09-2025 12:46:03 AM

  1. పలు దేవాలయాల మూసివేత
  2. నేడు సంప్రోక్షణ తర్వాత తెరువనున్న అర్చకులు

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, సెప్టెంబర్ 7: పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం రాష్ట్రంలోని పలు ఆలయాలను అర్చకులు మూసివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయం మధ్యా హ్నం 1 గంటల నుంచి మూసివేశారు. తిరి గి సోమవారం ఉదయం 3 గంటలకు తెరుస్తారు. భక్తులకు 7.30 గంటలకు  దర్శనం కల్పిస్తారు.

నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు కదిలి అన్నపూర్ణ పాపేశ్వర ఆలయం, కాల్వ నరసింహస్వామి ఆలయం, గుడిసరాల రాజ రాజేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు. సోమవారం ఉదయం నాలుగు గం టలకు ఆయా ఆలయాలు తెరుచుకోనున్నా యి.

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని మధ్యాహ్నం ఒంటిగంటకు అర్చకులు ద్వారబంధనం చేశారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున ఆలయ సంప్రోక్షణ తర్వాత తెరు చుకోనుంది. యాదగిరి గుట్ట ఆలయాన్ని కూడా అర్చకులు మూసివేశారు.