08-09-2025 12:07:19 AM
తాడ్వాయి, సెప్టెంబరు 7(విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే రెండొ కుంభమేళగా మేడారం విలసిల్లుతున్నది, గిరిజన సంస్క్రుతికి, సంప్రదాయలకు అద్దంపడుతుంది. జాతరకు రెండుకోట్ల మందిభక్తులు వస్తున్నారు. ప్రతీరోజు వేలల్లొ వస్తున్నారు భక్తులకు సౌకర్యాల కల్పనలొ నిర్లక్షం చూపుతున్నారు ఈక్రమంలొ భక్తులతో మేడారం కిక్కిరిసి పోయింది మహజాతర సమీపిస్తుంది ముందుగానే మొక్కులను సమర్పిం చుకుంటున్నారు.
ఆదివారం అయినందున చత్తీష్‌గడ్, మహరాష్ట ఆంధ్రప్రదేష్, ఓరిస్సా, ఆంద్రాప్రాంతం పొరుగురాష్టాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతి నిధులు, మంత్రులు, వైస్ చాన్సలర్లు, ప్రములు, పెద్ద ఎత్తున వాహనాలలో మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగు నీటి ప్రవాహంతొ ప్రవహిస్తుంది. స్నానాలకు అనుకూలంగా ఉంది. పిల్లలు, మహిళలు, మగవాల్లు నల్లాలకిందనె కాకుండా, వాగులొదిగి తల స్నానాలు చేశారు.
నూతన వస్త్రాలు థరించి వాగునుంచి గద్దెలకు చేరుకున్నారు. కొబ్బరి పసుపు, కుకుమలు సమ్మక్క- సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజులకు మొక్కులు సమర్పించుటకు నిలువెత్తు బంగారం (బెల్లాన్ని) తులా బారంలో తూగిన తలపై పెట్టుకుని మేకలతొ గద్దెలను చేరుకున్నారు.
దేవతలకు మొక్కులను గద్దెలపై ఉంచిసమర్పించారు. అనంతరం సమ్మక్క- సారలమ్మ లకు హుండీల్లొ కానుకలతో పాటు బంగారు, వెండి వస్తువులను సమర్పించారు. భక్తులరద్దీ పెరిగడంతొ ఆర్చీ గేటు నుంచి కిక్కరిసిపోయారు. పోలీసుల బందో భస్తుతో క్యూలైన్లలొ గద్దెలను చేరుకున్నారు ఉదయం 7,30 నుంచి 10 గంగలదాక రద్దీ పెరిగినందున ఇబ్బందులు పడ్డారు.
అసౌకర్యాలతో అవస్థలు..
భక్తులకు సౌకర్యాలు లేకపోవడంతొ ఇబ్బందులు పడ్డారు. తాగునీరు ఏర్పాట్లు చేయలేదు అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా ఉన్నారు. బయటనుంచి ప్లాస్టిక్ క్యాన్లలో తెచ్చుకున్నారు. పారిశుద్పాన్ని పట్టించుకునే నాదుడెలేకపోలేదు. ఎక్కడవేసిన గొంగళి అక్కడె అనే చందంగా మారింది. చెత్తా, చెదారంతొ జాతర ప్రాంతం కుడుకుని ఉంది. జంపన్న వాగు వద్దనైతె చెప్పలేనంత చెత్తా చెదారం ఉంది.
వర్షానికి తడిసి దుర్వాసన వస్తుండగా భక్తులు భరించవలసి వచ్చింది. పారిశుద్యపనులు చేపట్టెందుకు జిల్లా నుంచి అదికారులు ఎప్పుడొకసారి మొక్కుబడిగా చూసివెల్తున్నారనె ఆరోపనలు వస్తున్నాయి లక్షలాది రూపాయలను ప్రభుత్వం ఈ పనులకు వెచ్చించుతుంది తూతు మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని భక్తులు అంటున్నారు.