calender_icon.png 9 September, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమరానికి సిద్ధం.. నోటిఫికేన్‌కు అడ్డం!

08-09-2025 12:49:02 AM

  1. ప్రాదేశిక ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ సాధ్యమేనా ?

ఈనెల 10లోగా ఓటర్ల తుది జాబితా సిద్ధం

బీసీ రిజర్వేషన్లకు ప్రాధాన్యం

మొదలైన రాజకీయ కసరత్తులు

సంగారెడ్డి, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఏడాదిన్నర నుంచి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెడుతూ సెప్టెంబర్ నెలలో నే నోటిఫికేషన్ వస్తుందని భావించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సమయం కోరుతుండడంతో ఆశావహుల్లో నిరాశ నెలకొంది.

ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతా యా అనే మీమాంసలో పడుతున్నారు. ఎ ప్పుడైనా నోఫికేషన్ వస్తుందని భావించి అ ధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అందు లో భాగంగానే ప్రాదేశిక ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్దం చేసింది. ఓవైపు అధికారులు సమరానికి సిద్ధం చేస్తుంటే... నో టిఫికేషన్ అడ్డంకిగా మారుతోంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై ఆధారపడి కొత్త రాజకీయ సమీకరణాలకు వేదిక కానున్నా యి. గ్రామాల నుంచి జిల్లా వరకు బీసీల ఆశలు రిజర్వేషన్లపై బలంగా నిలబడడంతో, రాబోయే ఎన్నికలలో వారి పాత్ర ఎంత కీల కం అవుతుందో అన్నది స్పష్టమవనుంది.

ఎ న్నికల నోటిఫికేషన్తో పాటు గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేష న్ జాబితా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడంతో, గ్రామాల్లో బీసీ వర్గా ల మధ్య ఉత్కంఠ మరింత పెరిగింది. 

అడ్డంకిగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియ...

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పాస్ చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రపతి, గవర్నర్ వద్ద ఈ బిల్లు ప్రక్రియ ఆగిపోవడంతో స్థానిక స మరానికి అడ్డంకిగా మారిందని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు కాలాతీతం కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పటికీ ఈ ఎన్ని కల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలనే సంకల్పంతో వెనకడుగు వేస్తున్నారు.

దానికితోడు నోటిఫికేషన్ విడుదల చేయడానికి బిల్లు తీర్మానం చేసినా రాష్ట్రపతి, గవర్నర్ నుండి ఆమోదం పెండింగ్లో ఉండడంతో ఈనెలలో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో మరింత నిరాశ నెలకొంటుంది. 

ఈనెల 10 నాటికి ఓటర్ల తుది జాబితా...

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 10 నాటికి ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబర్ 6న ముసాయిదా జాబితాను ప్రదర్శించగా, 8వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం ద్వారా అ భ్యంతరాలను స్వీకరించి, అన్ని పరిశీలనల తర్వాత 10న తుది జాబితాను ప్రకటిస్తారు.

ఎన్నికల రిజర్వేషన్లు, నిర్వహణలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా ప్రభు త్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అడ్వొకేట్ జనరల్తో చర్చించిన తర్వాత 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణలు చేయబడ్డాయి. ఎవరైనా కోర్టుకు వెళ్ళినా, తుది తీర్పు ప్రకా రం ప్రవర్తిస్తామని అధికారులు స్పష్టం చేశా రు.

ఏడాదిన్నర కాలంగా పాలక మండళ్లు లేకపోవడంతో నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను తిరిగి పొందడంలో ఈ ఎన్నికలు కీలకంగా ఉంటాయి. స్థానిక సంస్థ ల పునరుద్ధరణ, అభివృద్ధి పనుల పూర్తి చేయడంలో ఎన్నికలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. 

మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఇలా...

సంగారెడ్డి జిల్లాలో 7,44,157 మంది పంచాయతీ ఓటర్లు ఉండగా, 5,370 పోలిం గ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 3,75, 843 మంది మహిళా ఓటర్లు, 3,68,270 మంది పురుష ఓటర్లు, ఇతరులు 44 మంది ఉన్నారు. అలాగే మెదక్ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు 190 ఉండగా, జడ్పీటీసీ స్థానాలు 21 ఉన్నాయి. జిల్లాలో 5,23,327 మంది ఓటర్లు ఉండగా 2,71,787 మంది మహిళా ఓటర్లు, 2,51,532 మంది పురుషులు, ఇతరులు 8 మంది ఉన్నారు.