calender_icon.png 20 August, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ సంబంధాలకు 3ఎం ఫార్ములా

20-08-2025 01:55:30 AM

- విభేదాలు.. వివాదాలుగా మారకూడదు

- వెల్లడించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్

- చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌తో భేటీ

- జాతీయ భద్రతా సలహాదారు ధోవల్, వాంగ్ సమావేశం

ఢిల్లీ, ఆగస్టు19(విజయక్రాంతి): భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలకు ‘3 ఎమ్’ ఫార్ములాతో ముందుకు సాగాలని భారత వి దేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఇరుదేశాల మధ్య పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలు అనే మూడు సూత్రాలతో ముందుకు నడవాలన్నారు. అలాగే ఇరుదేశాల మధ్య ఉన్న విభేదాలు అనేవి వివాదాలుగా మారకూడదన్నారు. భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో జైశంకర్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరుదేశాలు కలిసి ఇపుడు ముందుకు సాగాలని కోరుకుంటున్నాయి. ఇందుకోసం రెండింటి మధ్య నిజా యతీ, నిర్మాణాత్మక సహకారం అవసరం. ఇ రుదేశాలు సరిహద్దు ప్రాంతాల్లో శాంతియు త వాతావరణాన్ని నెలకొల్పడం ఎంతో అవసరం అని జైశంకర్ అన్నారు. అనంతరం చై నా విదేశాంగ మంత్రి వాంగ్ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు కొననసాగిస్తున్నామన్నారు. చైనా భూభాగం నుంచి కైలాస పర్వతం,మానస సరోవవర్ యాత్రలకు అనుమతి ఇచ్చామన్నారు. 

పరిస్థితులు మెరుగుపడ్డాయి: అజిత్ ధోవల్

  గడిచిన తొమ్మిది నెలల్లో ఇరుదేశాల సరిహద్దులో పరిస్థితులు మెరుగుపడ్డాయిని, అక్కడ ప్రస్తుతం ప్రశాంత వాతావారణం నెలకొందని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అన్నారు. భారత పర్య టనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ధోవల్ సమావేశమయ్యారు. వాంగ్ తో 24వ ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు ఢిల్లీలో జరిగాయి. ఈ సందర్భంగా ధోవల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ నెల 31, సెప్టెంబర్ 1 వ తేదీల్లో చైనాలోని తియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదసస్సులో పాల్గొంటారని తెలిపారు.