calender_icon.png 20 August, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుతిన్‌తో భేటీ అవుతా..

20-08-2025 01:53:25 AM

-ట్రంప్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టీకరణ

-యుద్ధం ముగిసే సమయం వచ్చింది: ట్రంప్

-రష్యా, ఉక్రెయిన్ అధినేతల భేటీకి ఏర్పాట్లు మొదలు

వాషింగ్టన్, ఆగస్టు 19: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి తాను సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో తాజాగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అ య్యారు. ఇరువురూ రష్యా ఉక్రెయిన్ మ ధ్య యుద్ధం ముగింపు పలికే అంశంపై చ ర్చించారు.

భేటీ అనంతరం రష్యా, ఉక్రెయిన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు వాషింగ్టన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇరు దేశా ల అధినేతలు త్వరలో భేటీ అవుతారని ట్రం ప్ స్పష్టం చేశారు. వాషింగ్టన్  యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు అం దించాలనే అంశంపైనే ప్రధాన చర్చ జరిగిందని తెలిపారు. త్రైపాక్షిక సమావేశం కీలకమైన ముందడుగు కాబోతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు త్రైపాక్షిక సమావేశాలతోనే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగుస్తుందని విదేశాల ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు.