calender_icon.png 17 July, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పౌరుడికి అందుబాటులో న్యాయ వ్యవస్థ

14-07-2025 12:00:00 AM

పెద్దపల్లి జూలై -13 (విజయ క్రాంతి): ప్రతి పౌరుడికి అందుబాటులో న్యాయ వ్యవస్థ ఉండాలనిన్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సంరక్షించే దిశగా మనమంతా కృషి చే యాలని రాష్ట్ర హై కోర్టు జడ్జి, పెద్దపెల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కే. లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఓదెల మండలంలో  నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవిష ్కరించేందుకు రాష్ట్ర హై కోర్టు జడ్జి,  పెద్దపెల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ లక్ష్మణ్, హై కోర్టు జడ్జీలు ఎన్.వి. శ్రావణ్ కుమార్, ఈ.వి.వేణు గోపాల్ , శ్రీనివాస్ రావు లతో కలిసి హాజరయ్యా రు.

రాష్ట్ర హైకోర్టు జడ్జిలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, సుల్తానాబాద్ బార్ అసోసియేష న్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డిలు స్వాగతం పలకగా, పండితులు వేదమంత్రాల మధ్య పూర్ణ కుం భంతో స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర హైకోర్టు జ డ్జి జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

రాష్ట్ర హై కోర్టు జడ్జి పెద్దపెల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఓదెల మండలంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పడటం చారిత్రాత్మిక అంశమని, దీని వల్ల ప్రజల సమీపంలో న్యాయం అందే అవకాశాలు మెరుగవుతాయని,జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని, న్యాయవ్యవస్థలో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి మౌలిక వసతుల మెరుగుదల, నూతన కోర్టుల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నామని , న్యా యవాదులు, ప్రజలు సైతం సహకరించాలని కోరారు.

న్యాయ వ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలోని ప్రతి పౌరునికి, వెనుకబడిన వర్గాల ప్రజలకు సమాంతరంగా న్యాయ సేవలు తప్పనిసరిగా అందాలని తెలిపారు.న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మనమంతా సమిష్టిగా పనిచేయాలని, కోర్టులో న్యా యవాదులు, జడ్జిల ప్రవర్తన మార్గదర్శకాలు మేరకు మర్యాద పూర్వకంగా ఉండాలని సూచించారు.

ఓదెల మండలంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని తయారు చేసేందుకు సహ కరించిన జిల్లా కలెక్టర్, అధికార యంత్రానికి హై కోర్టు జడ్జి అభినందనలు తెలిపారు.అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర హైకోర్టు జడ్జి లను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, జిల్లాలోని బార్ అ సోసియేషన్ సభ్యులు, డిసిపి కరుణాకర్, ఏసిపి కృష్ణ, ఆర్డీవో గంగయ్య, తహసిల్దార్ ధీరజ్, ప్ర జా ప్రతినిధులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.