ఘనంగా మేజిస్ట్రేట్ వీడ్కోలు సమావేశం
ఆమనగల్లు, ఏప్రిల్ 28, (విజయక్రాంతి): ఆమనగల్లు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి స్వరూప కాటంకి మంగళవారం వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. న్యాయమూర్తి ఆమనగల్లు కోర్టు నుండి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆమనగల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండే కార్ యాదిలాల్ సమక్షంలో వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై న్యాయమూర్తికి గజమాల, శాలువాలు, పూలమాలలతో సత్కరించి వీడ్కోలు పలికారు. న్యాయమూర్తి కోర్టుకు అందించిన సేవలకు గాను వారు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అండే కార్ యాదిలాల్ ఉపాధ్యక్షులు శేఖర్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, సంయుక్త కార్యదర్శి మధు గౌడ్,కోశాధికారి మల్లేష్, గ్రంథాలయ కార్యదర్శి గణేష్ గౌడ్, క్రీడా కార్యదర్శి సంతోష్ కుమార్,కార్యవర్గ సభ్యులు దేవేందర్ గౌడ్,సర్దార్ నాయక్ సీనియర్ న్యాయవాదులు లక్ష్మణ శర్మ,శ్రీనివాస్, కృష్ణయ్య, జానకి రాములు,సుధాకర్ రెడ్డి, దుడ్డు ఆంజనేయులు,మల్లేష్ గౌడ్,భాస్కర్ రెడ్డి, మల్లేష్, సూపరిండెంట్ మురళీధర్ న్యాయవాదులు రామకృష్ణ,మల్లేష్, జగన్ గౌడ్, మధు గౌడ్, కొప్పు కృష్ణ,మల్లేష్, శేఖర్, ఆంజనేయులు, శిరీష్,ప్రభు నాయక్,శ్రీశైలం, మహేష్,శ్రీనివాస్, లక్ష్మణ్, శిరీష, శైలజ, ప్రియాంక, న్యాయవాదులు,కోర్టు సిబ్బంది తదితరులున్నారు.






