calender_icon.png 1 May, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి రావు పూలే

11-04-2025 07:26:45 PM

బీసీ ఉద్యమ నాయకుడు చుంచు రాజ్ కిరణ్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి రావు పూలే అని బీసీ ఉద్యమ నాయకుడు చుంచు రాజ్ కిరణ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఐబి వద్ద బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యమ నాయకుడు చుంచు రాజు కిరణ్ మాట్లాడుతూ.... ప్రతి మహిళ చదువు కోవాలని, మహిళల చదువు తో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆకాంక్షతో మొట్ట మొదటి సారిగా తన భార్య సావిత్రి భాయి పులేకు విద్యను నేర్పించి మొదటి గురువుగా తీర్చి దిద్దిన మహానుభావుడని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల తీన్మార్ మల్లన్న టీం మహేష్ వర్మ, జిల్లా కార్యదర్శి దాస్యపు దీపక్, బీసీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కళ్యాణ రవి, బీసీ నాయకులు బండి రాజలింగు, పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు వేముల రాజగురువయ్య, మాలం చిన్నయ్య, మందపల్లి తిరుపతి, కాని గర్మ అశోక్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ దోండ ప్రభాకర్, శంకర్, బండారి శంకరన్న, బియ్యాల దినేష్, దేవ రాజేందర్, పవన్, సాయి, తదితరులు పాల్గొన్నారు.