4 May, 2026 | 3:29 AM

చిట్కుల్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

28-11-2024 12:48 PM

నివాళులు అర్పించిన నీలం మధు

పటాన్ చెరు, (విజయక్రాంతి) : మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలను చిట్కుల్ గ్రామంలో  గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ అభ్యర్థి నీలం మధు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు విద్య, మహిళోద్ధరణ కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి  పూలే అని కొనియాడారు. దిగువ కులాల ప్రజల సమాన హక్కుల కోసం  సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారని గుర్తుచేశారు. ఆయన బాట సమాజానికి అనుసరణీయం అని నీలం మధు అభిప్రాయపడ్డారు.