11 April, 2026 | 4:56 PM

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే

11-04-2026 03:48 PM

నిర్మల్,(విజయక్రాంతి): భారతదేశ  బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే అని  నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు  డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు అన్నారు. శనివారం ఫూలే  199వ జయంతి వేడుకలను  నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి సంఘం సభ్యులు  పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు మాట్లాడుతూ...  బడుగు బలి బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పూలే ఎంతో పోరాట చేశారని, దీనికి నిదర్శనం బ్రిటిష్ వారే మహాత్మా అనే  బిరుదును పూలేకు ఇవ్వడం జరిగింది. చదువు ద్వారానే అందరీ భవిష్యత్తు బాగా పడుతుందని  ఎలుగెత్తి   చెప్పిన గొప్ప  వ్యక్తి ఫూలే అని ఆయన అన్నారు. ఫూలే రచించిన గులాం గిరి పుస్తకం ఎంతో ప్రాచుర్యం చెందిందని  ఆయన అన్నారు.

  వచ్చే సంవత్సరం ఫూలే జయంతి వేడుకలను  పూలే దంపతుల విగ్రహాల వద్ద జరుగుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం  కార్యనిర్వాహక అధ్యక్షుడు మరకంటి జీవన్, అసోసియేట్ అధ్యక్షుడు కొత్తపల్లి గంగాధర్, కో.కన్వీనర్లు కత్రోజు అశోక్, చారి, సిరికొండ రమేష్,చందుల ఊషన్న, పండరీనాథ్, సంపంగి ప్రభాకర్,శివకుమార్ వర్మ,  అధ్యక్షులు ఏంబడి.చంద్రశేఖర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు స్వదేశ పరికిపండ్ల,రామకృష్ణ, రమేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.