3 April, 2026 | 8:31 PM

రెండు లక్షల మెజార్టీ ఖాయం

15-05-2024 01:41 AM

మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

మహబూబ్‌నగర్, మే 14 (విజయక్రాంతి): ప్రజల్లో చైతన్యం బాగా పెరిగిందని మహబూబ్‌నగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో ఎవరు ప్రధాన మం త్రిగా ఉండాలనేది ప్రజలు ముందుగానే నిర్ణ యం తీసుకున్నారని తెలిపారు. ఉదయం 7 గంటలకే పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌ల దగ్గరకు ఓటర్లు వచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సీఎం రేవంత్‌రెడ్డి 8 సార్లు మహబూబ్‌నగర్‌కు వచ్చారని, అయినా పాలమూరులో బీజేపీకి రెండు, మూడు లక్షల వరకు మెజార్టీ రావడం ఖాయమన్నారు. ఎన్నికల షెడ్యూల్డ్ వచ్చినప్పటి నుంచి బీజేపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి. పద్మాజారెడ్డి, జిల్లా అధ్యక్షులు పి. శ్రీనివాస్‌రెడ్డి, నేతలు రమేష్‌కుమా ర్, కిరణ్‌కుమార్‌రెడ్డి, అంజయ్య, రామాంజనేయులు, కిశోర్ తదితరులు పొల్గొన్నారు.