మరోసారి అధికారం బీజేపీదే
బీజేపీ శాసనసభా పక్షనేత మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్,మే 14( విజయక్రాంతి): కేంద్రంలో బీజేపీ మరో సారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని, బీజేపీని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
దేశం కోసం, ధర్మం కోసం మోదీ ప్రధాని కావడం కో సం ఇన్ని రోజులు ఎంతో శ్రమించిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, ముఖ్యమంత్రి రేవంత్ మాట ల్లో మార్పు కనిపించిందని చెప్పా రు. పోలింగ్‌కు ముందు 14 సీట్లు గెలుస్తామని చెప్పినవారే ఇప్పుడు 9 సీట్లు గెలుస్తామంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.




