9 June, 2026 | 7:42 PM

మహిళాశక్తి సభ.. ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ముఖ్యమంత్రి

09-06-2026 06:29 PM

హైదరాబాద్: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహిళాశక్తి సభకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. స్వయం సహాయక బృందాలకు 553 ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల హైర్ ఛార్జీల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంత్రి మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు.  ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... అందరికంటే ముందుంటామని మహిళలు నిరూపిస్తున్నారని, వ్యవసాయానికి ప్రాణవాయువు ఆడబిడ్డలు అని పేర్కొన్నారు.

ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి వచ్చిందని సంతోషపడే సంస్కృతి మనది అని, మన సంస్కృతి, సంప్రదాయంలో మహిళలు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందని, మహిళలను స్ఫూర్తిగా తీసుకొని పరిపాలన చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చేందుకు వందల ఏళ్లు పట్టిందని, భారత్ కు స్వాతంత్య్రం రాగానే మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన ఘనత నెహ్రూకి దక్కుతుందని ఆయన గుర్తు చేశారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని అందించిన ఘనత కాంగ్రెస్ దే అని, బీజేపీ పార్టీ అధ్యక్ష పదవిని ఒక్కసారైనా మహిళలకు ఇచ్చారా..? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి ఐదేళ్లలో ఒక్క మహిలకూ మంత్రి పదవి ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామని వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో మహిళలకు రాజీవ్ గాంధీ రిజర్వేషన్లు ఇచ్చారని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని 2013లో సోనియాగాంధీ బిల్లు ప్రవేశపెట్టారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మహిళలకు గుర్తింపు ఉంటుందని, మహిళలకు ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్ల సున్నా వడ్డి నగదును చెల్లించలేదని సీఎం చెప్పారు. మహిళలతో పెట్టుకున్న ఎవరైనా అధికారంలో ఉంటారా..? అని, అందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందన్నారు.