1 April, 2026 | 2:36 AM

అకాల వర్షం... అపార నష్టం...

01-04-2026 12:00 AM

సుల్తానాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో సోమవారం తెల్లవారుజామున భారీ ఈదురు గాలుల తో కురిసిన అకాల వర్షం వల్ల పలుచోట్ల మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి, మండలంలోని రేగడి మద్దికుంట, కనుకుల, చిన్నకల్వల, సుద్దాల, మంచరామి తో పాటు పలు గ్రామాల్లో  చేతికి పంట అందే   సమయంలో ఈ అకాల వర్షం పడడం రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఏఈఓ లు  పరిశీలించారని, సుల్తానాబాద్ మండలంలో 484 మంది రైతులకు సంబంధించిన  460 ఎకరాల్లో  మొక్కజొన్న , వరి పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి పైడితల్లి తెలిపారు, ఏ డి ఏ టెక్నికల్ అధికారి కాంతారావు నెలకొరిగిన పంటలను పరిశీలించారు,  కాగా  ప్రభుత్వం పంటకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని పలు గ్రామాల  రైతులు కోరుతున్నారు.