calender_icon.png 1 December, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మకరతోరణ వితరణ

01-12-2025 12:59:59 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఆంజనేయునికి మకర తోరణ అలంకరణ కార్యక్రమం మంగళవారం జరుగనుంది. చింతల్తానా గ్రామంలో ఆంజనేయ స్వామికి ఒగులాపూర్ గ్రామస్తులు రేగులపాటి రామ్మోహన్ రావు రాధిక దంపతులు రూ.50,000/- లతో తయారు చేయించిన మకర తోరణ అలంకరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ బాధ్యులు రేగులపాటి వెంకట్ రావు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు  గిరిధర్ స్వామి ఆధ్వర్యంలో మకర తోరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

గత సంవత్సరం రేగులపాటి రామ్మోహన్ రావు-రాధిక దంపతులు భక్తుల సౌకర్యార్థం నవగ్రహ యోగపీఠము నిర్మాణానికి రూ.1,50,000/- లు వెచ్చించి నవగ్రహాలను ప్రతిష్టించారు. ముంపు గ్రామమైన చింతల్ ఠాణా గ్రామం రేగులపాటి వంశం వారికి మూలమైనందున, ఆ పురాతన విగ్రహాలు పునర్ ప్రతిష్టించడం వలన అన్నివర్గాలకు మేలు జరుగుతుందని వారి ఆశయన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రానికి సమీపంలో ఉన్నందున, ఆంజనేయ క్షేత్ర, బ్రహ్మసూత్ర శివలింగం ఒకే చోట ఉండడం వలన మన గ్రామ అదృష్ట మని దీన్ని అన్నివర్గాల కలిసికట్టుగా అభివృద్ధిగా చేసుకుందామన్నారు. భక్తులందరూ  మంగళవారం రోజు మకర తోరణ అలంకరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.