01-12-2025 12:49:18 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాక గ్రామానికి చెందిన బూర బాబు సర్పంచ్ పదవికి జైలు నుండి నామినేషన్ దాఖలు చేశాడు. బూర బాబు ఇటీవల జరిగిన ఒక కేసులో జైలుకు వెళ్లాడు మారుపాక గ్రామం సర్పంచ్ ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కావడంతో బూర బాబు జైలు నుండి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి పంపించగా వారి బంధువులు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో బూర బాబు భార్య బూర వజ్రమ్మ వేములవాడ రూలర్ ఎంపీపీగా పని చేశారు.