calender_icon.png 1 December, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిల్ట్ పాలసీతో భారీ స్కాం

01-12-2025 01:26:19 PM

డిసెంబర్ 7న మహాధర్నా 

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(Ramchander Rao) నేతృత్వంలో బీజేపీ ప్రతినిధులు బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను(Governor Jishnu Dev Varma) కలిశారు. తెలంగాణలో హిల్ట్ పాలసీ పేరుతో రూ. వేలకోట్ల కుంభకోణం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. 9 వేల ఎకరాలకుపైగా రియల్ ఎస్టేట్ గా మార్చాలని చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమాలు జరగకుండా చూడాలని బీజేపీ నేతలు గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చారు. జీవో నెంబర్ 27ను విత్ డ్రా చేసేలా చూడాలని గవర్నర్ ను కోరినట్లు రామచందర్ రావు మీడియాతో అన్నారు.

హిల్డ్ పాలసీ(Hilt Policy) ద్వారా అక్రమాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అప్పటి, ఇప్పటి ధరలు పోల్చి చూస్తే అక్రమాలు తెలుస్తున్నాయని వెల్లడించారు. కోకాపేటలో ఇటీవల ఎకరం ఎంత పలికిందో మనం చూశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 7న ఇందిరాపార్క్(Indira Park ) వద్ద మహాధర్నా నిర్వహిస్తామని రామచందర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ విస్తరణలోనూ(GHMC Expansion) అనేక కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. గతంలో పరిశ్రమలకు చాలా తక్కువ ధరకు భూములు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు శివారల్లలోనే ఎకరం వందల కోట్లు పలుకుతోందన్నారు. ఈ లెక్కన పరిశ్రమల భూములు చాలా తక్కువ ధరకు రియల్టర్లకు దక్కే అవకాశముందని రామచందర్ వెల్లడించారు.