01-12-2025 12:43:28 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో ఆసిఫాబాద్ ఆర్టీసీ బస్ డిపో చెందిన ఆర్టీసీ బస్సులను డిపో మేనేజర్ రాజశేఖర్ తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా టికెట్ తీసుకుని ప్రయాణించాలని టికెట్ లేని ప్రయాణం నేరమని ప్రయాణికులకు సూచించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ప్రయాణికుల వద్ద నుండి టికెట్లను పరిశీలించారు. వారి వెంట ఆర్టిసి ఎడిసి పోశం, సిబ్బంది ఉన్నారు.