బోనాల పండుగకు ఏర్పాట్లు చేయండి
ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతి
ఘట్‌కేసర్, జులై 23 (విజయక్రాంతి): ఘట్‌కేసర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలల్లో జరుగనున్న బోనాల పండుగకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డివిజన్ కాంగ్రెస్ అధ్య క్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి ఘట్ కేసర్ డిప్యూటి కమిషనర్ అల్లూరి వాణి కి వినతిపత్రం అందజేశారు. ఘట్ కేసర్, ఎన్‌ఎఎఫ్ సి నగర్, కొండాపూర్, బొక్కొనిగూడ, చందుపట్లగూడ, శివారెడ్డిగూడ, అంబేద్కర్ నగర్, బాలాజీనగర్, ఈడబ్ల్యుఎస్ కాలనీ, గాంధీనగర్, రాంనగర్, సాయినగర్, ఎస్‌ఆర్ నగర్ తదితర కాలనీలో జరిగే భోనాల పండుగ సందర్భంగా దేవాలయాల పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి డీసీని కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు కొంతం అంజిరెడ్డి, మాజీ కౌన్సిలర్ కడపొల్ల మల్లేశ్, బర్ల దేవేందర్, నాగరాజు, మీసాల సుధాకర్ రావు , ఉల్లి అంజనేయులు పాల్గొన్నారు.






