రాహుల్ అరెస్టుకు నిరసనగా ర్యాలీ
ఘట్‌కేసర్, జూలై 23 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం శివారెడ్డిగూడ హనుమాన్ ఆలయం నుండి ఘట్ కేసర్ పట్టణం లోని అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి హాజరై ర్యాలీలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అరెస్టులు, బెదిరింపులతో అణచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఈ ర్యాలీలో డీసీసీ ఉపా ధ్యక్షుడు మహేష్ గౌడ్, డీసీసీ సెక్రెటరీ మామిండ్ల ముత్యాల్ యాదవ్, ఘట్కేసర్, పోచారం, ఎదులాబాద్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.






