24 July, 2026 | 3:24 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన మాగంటి సునీత గోపీనాథ్

24-07-2026 12:00 AM

జూబ్లీహిల్స్, జూలై 23 (విజయక్రాంతి): బోరబండ డివిజనులోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇంచార్జి మాగంటి సునీత గోపీనాథ్ పరిశీలించారు.ఈ మేరకు డివిజనులోని వినాయకరావునగర్,సైట్-3 పరిధిలో పలు పోలింగ్ బూత్ లను ఆమె గురువారం సందర్శించారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఏల ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటరు నమోదు, మార్పులు, సవరణలు ఇతరాత్ర కార్యకలాపాల వివరాల గురించి తెలుసుకున్నారు.

సంబంధిత అధికారులతో మాట్లాడి ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న తీరును అంచనా వేశారు. అనంతరం స్థానిక నివాసాల వద్దకు వెళ్లి ఎన్యుమరేషన్ ఫారం నింపడంపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఓటరు ప్రక్రియలో తమ వివరాలను సరిచూసుకోవాలని కోరారు. తప్పకుండా బీఎల్‌ఓలకు ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాలని విన్నవించారు. తద్వారా ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.