17-07-2025 12:00:00 AM
ఖమ్మం, జులై 16 (విజయ క్రాంతి): మధిరలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం నగరంలోని సిపిఐ కార్యాలయంలో బాగం ప్రసాద్ అధ్యక్షతన సిపిఐ రఘునాథపాలెం మండల కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పగడాల మ ల్లేష్ మాట్లాడుతూ ఈనెల 19, 20 తేదీల్లో మధిరలో సిపిఐ 23వ జిల్లా మహాసభలు జరుగుతున్నాయన్నారు.
ఈ మహాసభలకు రఘునాథపాలెం మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రజల పక్షాన పోరాడేది సిపిఐ పార్టీ అన్నారు. మండలంలో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటాలు నిర్వహించాలన్నారు.
కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా విభజించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల -సహాయ కార్యదర్శి లచ్చిరాం, జామ్లా, చీనా, రావెళ్ల సురేష్, సత్యనారాయణ, నాదం, కురువెళ్ల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.