17-07-2025 12:00:00 AM
డీఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఇన్చార్జి రామ్ చరణ్ తేజ్
భద్రాద్రి కొత్తగూడెం, జులై 16, (విజయ క్రాంతి): విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే తప్ప తాగి విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టిన ఎస్సీ హాస్టల్ వార్డెన్ శ్రీధర్ ను సస్పెండ్ చేయాలనిభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేశారు. మేరకు బుధవారం డిఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనసూర్య ని డిఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకత్వం వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఆ విద్యార్థి సంఘం జిల్లా ఇన్చార్జి రామ్ చరణ్ తేజ్ మాట్లాడుతూ వార్డెన్ తప్ప తాగి డాన్సులు వేస్తూ, తాగి విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టినట్లు ఆరోపించారు. విద్యార్థులు రాత్రి 11 గంటల సమయంలో వార్డెన్ అతని స్నేహితులు తాగి స్టఫ్, ఆహారం తెచ్చుకొని డాన్సులు వేస్తూ, విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టారన్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం కూడా అందించడం లేదన్నారు. విద్యార్థులను మానసికంగా హింసిస్తూ ఇబ్బంది పెట్టారన్నారు. వార్డెన్ ని సస్పెండ్ చేస్తూ,అతని ఇద్దరు అనుచరులు పై కేసు నమోదు చేయాలని డిడి కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అరవింద్, నాగ తేజ పాల్గొన్నారు.