calender_icon.png 18 July, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్

17-07-2025 12:00:00 AM

విడుదలకై ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా అర్జీ

ఇల్లందు టౌన్, జులై 16 ,(విజయ క్రాంతి): పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధుల మంజూరు కై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డు ద్వారా అర్జీ చేస్తున్నట్లు పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి గణేష్ తెలిపారు.బుధవారం పి డి ఎస్ యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలోని జూనియర్ డిగ్రీ కాలేజీలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థులతో కలిసి ఉత్తరాలు వ్రాయడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధి ప్రధాన ఎజెండాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలను మర్చిపోయిందన్నారు. దాదాపు రాష్ట్రంలో రూ 8,000 కోట్ల స్కాలర్షిప్, రియంబర్స్మెంట్లు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. స్కాలర్షిప్, రియంబర్స్మెంట్లు విడుదల చేయని కారణంగా డిగ్రీ పూర్తి చేసుకున్న వి ద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండ విద్యార్థులను అనేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు .

రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించడానికి డబ్బులు ఉన్నాయి కానీ వి ద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవని విమర్శించారు. విద్యారంగం నిర్లక్ష్యం చేస్తే కెసిఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందనీ హెచ్చరించారు.

తక్షణ మే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ప్రీయంబర్స్మెంట్లను విడుదల చేయాలని లేని పక్షంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు ఈ.ప్ర శాంతి నాయకులు పి.ప్రవళిక. నరేష్ సిద్దు. రాము. లోకేష్. తదితరులు పాల్గొన్నారు.