జనాగ్రహ బహిరంగ సభను విజయవంతం చేయండి
నాయకులు కార్యకర్తలతో చేవెళ్ళలో సన్నాహక సమావేశం.
సభను విజయవంతం చేయాలన్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, కె.ఎస్. రత్నం.
చేవెళ్ళ 6 మే (విజయక్రాంతి) : ఈ నెల 10న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న సందర్బంగా చేవెళ్ళ పార్లమెంట్ కేంద్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అనంత్ రెడ్డి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ అధ్యక్షతన చేవెళ్లలో భాజపా నాయకులతో కలిసి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కె ఎస్. రత్నం మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే కీలక వేదికగా ఈ సభ నిలవనుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ సభ ఉద్దేశమని చెప్పారు.
చేవెళ్ల నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. గ్రామ, మండల స్థాయిలో కార్యకర్తలు నాయకులు సమన్వయంతో జనసైమికరణకు ఏర్పాట్లు చేపట్టాలని పార్టీ నాయకులకు సూచించారు.
ఈ సమావేశంలో భాజపా నాయకులు మోహన్ రెడ్డి డా. వైభవ్ రెడ్డి వెంకట్ రెడ్డి మాణిక్య రెడ్డి అశోక్ పత్తి సత్యనారాయణ కరికే శ్రీనివాస్ చీర శ్రీనివాస్ కుమార్ గౌడ్ చంద్రశేఖర్ రెడ్డి అభిశేఖర్ రెడ్డి జైపాల్ రెడ్డి రిషికేశ్ ఉమాశంకర్ రెడ్డి బాల్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి కృష్ణ విఠల్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.






