calender_icon.png 6 October, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుళజన బీడీ కార్మిక సంఘం 2వ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయండి

06-10-2025 01:26:33 AM

రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సిద్ది రాములు 

నిజామాబాద్, అక్టోబర్ 5, (విజయక్రాంతి): అక్టోబర్ 11 తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ సితక్క గారు హాజరవుతారని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిగాద సిద్ది రాములు తెలిపారు.

ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్  సమావేశంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిగాద సిద్ది రాములు మాట్లాడుతూ అక్టోబర్ 11న మధ్యాహ్నం రెండు గంటలకు పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. 

అంతకు ముందు తిలక్ గార్డెన్ నుండి పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. రెండవ రోజు అక్టోబర్ 12న తిలక్ గార్డెన్ లోని న్యూ అంబేడ్కర్ భవన్ లో తెలంగాణ 13 జిల్లాల నుండి,ఈ బహిరంగ సభకు మరియు రెండవ రోజు ఆదివారం నాడు 250 మంది ప్రతినిధులతో, తిలక్ గార్డెన్ అంబేద్కర్ భవనం లో ప్రతినిధుల మహాసభ ఉంటుందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర ఉపాద్యక్షులు,నాగారపు యెల్లయ్య, బి,జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యం,ఆంజనేయులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి, చట్ల పొశవ్వ,రాష్ట్ర కోషదికారి,స్తెయ్యద్, బిఎల్ టీయూ నిజామాబాద్ నగర అధ్యక్షులు వై.అనిల్ కుమార్,

కార్యదర్శి గంగా శంకర్,తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బిఎల్ టీయూ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, కే,శ్రీ హరి,జగిత్యాల జిల్లా అధ్యక్షులు, ప్రభు లింగం, జిల్లా నాయకులు,సత్తయ్య, ఖాదిర్, నిర్మల్ జిల్లా నాయకురాలు, అరుణ,కామారెడ్డి, జిల్లా నాయకులు, శ్రీ ను,స్వామి, మెదక్ జిల్లా నాయకులు, లింగం, నిజామాబాదు జిల్లా నాయకులు, గోదావరి, నర్సిములు, గంగాధర్ పాల్గొన్నారు.