06-10-2025 01:31:00 AM
మాజీమంత్రి, సిద్దిపేట్ శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు
గాంధారి, అక్టోబర్ 5 (విజయ క్రాంతి): రాష్ట్రంలో రానున్న రోజుల్లో బిఆర్‌ఎస్ పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని మాజీమంత్రి, సిద్దిపేట్ శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు అన్నారు ఈ మేరకు ఆదివారం రోజున గాంధారి మండలంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధారి మండల కేంద్రంలోని సొసైటీ నుండి భారీ బైక్ ర్యాలీతో హరాలే గార్డెన్ వరకు చేరుకొని అనంతరం ఇక్కడ ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ జెడ్పిటిసి హరాలే తానాజీరావు కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయనతోపాటు మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు నాయకులు కార్యకర్తలు బీజేపీ నుంచి బీఆర్‌ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఉద్యమ కాలం నుండి పార్టీలో ఉంటూ ఉద్యమకారుడుగా పేరు తెచ్చుకున్న తానాజీ రావు బీజేపీకి వెళ్లి తిరిగి బీఆర్‌ఎస్ పార్టీలో చేయడం శుభసూచకమని ఆయన అన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు బీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుంది.
బీఆర్‌ఎస్ నాయకులు ఎవరు కూడా నాయకులు ఆధైర్య పడకూడదని ఎవరెవరు అధికారులు పోలీసోళ్ళు ఇబ్బంది పెట్టిర్రో వాళ్ళందరి సంగతి చెప్తాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్ గంప గోవర్ధన్ హనుమంత్ సిండే, జనార్దన్ గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజుబుద్దిన్, మాజీ జడ్పీ చైర్మన్ రాజు శోభ, తో పాటు గాంధారి మండల బి ఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు శివాజీ రావు,రెడ్డి రాజులు తో, తో పాటు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ
ఎల్లారెడ్డి అక్టోబర్ 5 (విజయ క్రాంతి): వరదల్లో తీవ్రంగా నష్టపోయి ఇబ్బంది పడుతున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట్ ప్రాంత ప్రజలను మాజీ మంత్రి, హరీష్ రావు, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ స్థానిక నాయకులతో కలిసి, ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం లోని నాగిరెడ్డిపేట శివారు ప్రాంతంలో నీట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పలువురు నాయకులతో రైతులతో కలిసి పర్యవేక్షించి పలువుర రైతులను పరామర్శించారు.
అనంతరం మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో వర్షాలతో వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది, వందలాది ఇండ్లు కూలిపోయాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యమంత్రి, నేటి రోజుకు నెల రోజుల క్రితం స్వయంగా కామారెడ్డికొచ్చి రివ్యూ చేసి అందర్నీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి నిన్నటికి నెలరోజులు పూర్తయింది. కానీ నయా పైసా సహాయం జరగలేదు. జిల్లా అధికారులు పంపిన రిపోర్టులో దాదాపు 340 కోట్ల నష్టం జరిగిందని చెప్తే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి 34 రూపా యలు కూడా ఇవ్వలేదు.
మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, కామారెడ్డి జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ముజీ బుద్దిన్, ఎల్లారెడ్డి మాజీ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, నాగిరెడ్డిపేట మండలం మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, నాగిరెడ్డిపేట మండలం బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, గుర్రాల సిద్దయ్య, మాల్ తుమ్మెద ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు, నర్సింలు, నాయ కులు వంశీధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పరిశోధన్ రెడ్డి, ఎల్లారెడ్డి మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్య క్షులు, జలంధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్, ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సం ఘం అధ్యక్షులు ఏగుల నర్సింలు, అరవింద్ గౌడ్, రాజు, ఎరుకల సాయిలు, బబ్లు పాల్గొన్నారు.