13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

రైల్వే అండర్ బెడ్ నిర్మాణ పనులపై దుష్ప్రచారం

28-03-2026 12:00 AM

వర్షాకాలం లోపే పనులు పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే పాయల్

ఆదిలాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తికావని ఎవరైతే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారో వా రు ఇక్కడ జరుగుతున్న పనులను చూసైనా కళ్లు తెరవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ లోని తాంసి బస్టాండ్ వద్ద కొనసాగుతున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను శుక్రవారం రైల్వే అధికారులు, బీజేపీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.

పనుల పురోగతిపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నా రు. పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. గత పదేం డ్లు పాలించిన బీఆర్‌ఎస్, రెండుళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

దీంతో కేంద్రం నుంచి ఎంపీ గోడం నగేష్ సహకారంతో 104 కోట్ల 50 లక్షల రూపాయలను తీసుకువచ్చి పనులను చేపడుతున్నామని తెలిపారు. రైల్వే అండర్ బ్రిడ్జి పనులపై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చే స్తుందని మండిపడ్డారు. వర్షకాలం ప్రా రంభంలోపే నిర్మాణ పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పద్మవార్ రాకేష్, శ్రీకాంత్, గంట జీవన్, ధోని జ్యోతి, నాయకులు హనుమండ్లు, కృష్ణయాదవ్, శివ పాల్గొన్నారు.