22 July, 2026 | 11:59 PM

ప్రజాభిప్రాయం మేరకే చిహ్నాల మార్పు

01-06-2024 02:54 AM

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్, మే 31 (విజయక్రాంతి): ప్రజాభిప్రాయం మేరకే రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి స్పష్టంచేశారు. నిజామాబాద్‌లోని కాంగ్రెస్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజల భాగ స్వామ్యం లేకుండానే నామామాత్రంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరిగేవని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తుందన్నారు. సామాన్యుల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పరీక్ష పేపర్ల లీకేజీ, లిక్కర్ స్కాంలు జరిగాయని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆంధ్రా కాంట్రాక్టర్లకు దక్కాయన్నారు. నేడు రాష్ట్ర గీతానికి కీరవాణి  స్వర కల్పన చేస్తుంటే మాత్రం కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని దుయ్యబట్టారు. నాడు కవి అందెశ్రీ, విద్యావేత్త చుక్కా రామయ్య, జేఏసీ చైర్మన్‌ను కోదండరాంను  ఏనాడూ బీఆర్‌ఎస్ ఫ్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అలాంటి బీఆర్‌ఎస్ నేడు రాష్ట్ర చిహ్నం, గీతంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నదని మండిపడ్డారు. సమావేశంలో పీసీపీ ప్రధాన కార్యదర్శి గంగాధర్, నాయకులు మానాల మోహన్ రెడ్డి, కేశ వేణు, వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు.