8 June, 2026 | 6:22 PM

Breaking News

ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •  

మల్లీశెట్టి వెంకటేష్ కు గౌరవ డాక్టరేట్

14-02-2026 08:23 PM

భూత్పూర్: సామాజిక సేవను లక్ష్యంగా చేసుకొని, సమాజంలోని అశ్రయహీనులకు ఆశగా నిలిచిన మల్లీశెట్టి వెంకటేష్ కు శనివారం భారతీయ విద్యా భవన్ తమిళనాడు రాష్ట్రం ఐ గ్లోబల్ హ్యూమన్ పీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (డిలే్వేర్ స్టేట్, యూఎస్ఎ) "సామాజిక సేవ" (సోషల్ వర్క్) విభాగంలో గౌరవ డాక్టరేట్ పట్టా ప్రధానం చేశారు.  

ఈ గౌరవం వ్యక్తి గత విజయానికి మాత్రమే కాదు, విలువలకు, సామాజిక బాధ్యత పట్ల ఉన్న నిబద్ధతకు, మానవత్వం పట్ల ఉన్న ప్రేమకు అందించిన అంతర్జాతీయ గుర్తింపు స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఇది ఒక “విన్నర్ టర్నింగ్ పాయింట్” కాదు, ఇది ఒక “సర్వీస్ టర్నింగ్ ఇంటో లేగసీ” అనే ఘనత. ఇది ఒక గౌరవం కాదు ఇది ఒక సేవా ప్రయాణంపై సమాజం ఉంచిన గౌరవంగా అవార్డు అందుకున్న ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ హ్యూమన్ పీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సహకారంతో చెన్నైలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు రావడం పట్ల జిల్లా ప్రజలు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.