5 August, 2026 | 1:49 AM

మహిళ మెడలోని పుస్తెలతాడు చోరీ

05-08-2026 12:57 AM

నాగోల్, ఆగస్టు 4 (విజయ క్రాంతి) నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం ప్రాం తంలో ఓ మహిళ మెడలోని బం గారు పుస్తెల గొలుసును ముగ్గు రు దుండగులు లాక్కెళ్లిన ఘటన మంగళవారం సాయంత్రం చో టుచేసుకుంది. పోలీసుల వివరా ల ప్రకారం.. జీవీఆర్ కాలనీకి చెందిన సాగ్గం ధనమ్మ (56) ఆర్.కే. నగర్లోని చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, హెచ్పీ గ్యాస్ గోదాం సమీపంలోని వీధిలో పల్సర్ బ్పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తె ల గొలుసును లాక్కొని తట్టి అన్నారం వైపు పరారయ్యారు.

బాధితురాలి ఫిర్యాదు మేర కు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి సంఘట నా స్థలాన్ని పరిశీలించి పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టగా, ఘటన జరిగిన ప్రాంతంతో పాటు వారు పారిపోయిన మార్గంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.