21 March, 2026 | 11:27 AM

ఘనంగా మల్లు స్వరాజ్యం వర్ధంతి

21-03-2026 01:04 AM

నూతనకల్, మార్చి 20 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 4వ వర్ధంతి వేడుకలు  మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన మొట్టమొదటి మహిళా దళ కమాండర్గా ఆమె చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. దొరల పాలనకు వ్యతిరేకంగా.. ‘బాంచన్ దొర కాలు మొక్కుతా‘ అన్న నోళ్లతోనే, దొరలకు ఎదురుతిరిగి బందూకు పట్టించిన వీరవనిత ఆమె అని కొనియాడారు.

భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె చేసిన పోరాటం మరువలేనిదని, ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు అంజపల్లి లక్ష్మయ్యతో పాటు గ్రామ శాఖ కార్యదర్శులు బొజ్జ శ్రీను, బత్తుల తిరుమలేష్, గజ్జల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే శాఖ సభ్యులు ముండ్ల సంజీవ, బత్తుల సూరయ్య, బత్తుల రవి, ఉప్పుల పరమేష్, తోట్ల శేఖర్, అల్లిపురం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.