13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఏసీబీకి చిక్కిన మామడ ఎస్సై

27-03-2026 01:39 AM

లంచం తీసుకుంటుండగా పట్టివేత 

లక్ష్మణ్‌చందా, మార్చి 26 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మామడ ఎస్సై తీగల అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మామడ మండలానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో ఫిర్యాదు వచ్చింది. మధ్యవర్తిత్తం ద్వారా సమస్య పరిష్కారం కోసం రూ.40 వేలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేయగా, 20 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు చెప్పగా, వారి సూచన మేరకు గురువారం లంచం ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అయితే ఇక్కడ పనిచేసిన ఎస్సైలు సత్యనారాయణ, రాజు ఇదివరకే ఏసీబీకి చిక్కడం గమనార్హం.