19 August, 2026 | 2:46 AM

మద్యం మత్తులో 100కు కాల్స్.. వ్యక్తి అరెస్ట్

19-08-2026 01:46 AM

మేడిపల్లి, ఆగస్టు 18 (విజయక్రాంతి) : మద్యం మత్తులో డయల్-100కు 4-5 సార్లు పదేపదే ఫోన్ చేసి పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించిన వ్యక్తిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెంగిచెర్ల క్రాంతి కాలనీకి చెందిన డ్రైవర్ ఏళ్లపట్టి వరప్రసాదొడ్డి (47) ఈ నెల 15న రాత్రి చిన్న క్రాంతి కాలనీ ప్రాంతంలో మద్యం మత్తులో 100కి ఫోన్ చేసి న్యూసెన్స్ కలిగించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విలువైన సమయం వృథా చేసినందుకు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం నిందితుడిని ఎల్బీనగర్లోని 1వ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్టులో హాజరుపరిచారు.