calender_icon.png 4 August, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

04-08-2025 12:00:00 AM

కాగజ్ నగర్, ఆగస్టు 3(విజయక్రాంతి): దహెగాం మండలం బిబ్రా గ్రామ శివారులో ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  నిషిద్ధమైన గుడుంబా విక్రయానికి పాల్పడుతున్న ఒకరిని అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు.

దారవత్ తారచంద్ వద్ద 8 లీటర్లు (దాదాపు రూ.3,500 విలువ), 380 పాకె ట్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. న్యాయపరమైన చర్యల కోసం నిందితుడిని దహెగాం పోలీ స్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఇలాంటి నిషేధిత పదార్థాల తయారీ, రవా ణా, విక్రయంపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ పేర్కొన్నారు.ఈ తనిఖిలలో సిబ్బంది వి.మధు, విజయ్, మహ మ్మద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.