calender_icon.png 4 August, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియాలో పర్యటించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ విజిలెన్స్ అధికారి

04-08-2025 12:00:00 AM

ఇల్లెందు, ఆగస్టు 3, (విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బాదావత్ వెంకన్న ఆదివారం ఇల్లందు ఏరియా లోని నూతన జే కే కోల్ మైన్ ప్రాజెక్ట్ కు సం బంధించిన స్థలాలను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను జి.యం వి.కృష్ణయ్య ని అడిగి తెలుసుకున్నారు. తరువాత సి.హె చ్.పి ని సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..

బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధిక మించాలని, బొగ్గు రవాణా కు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని, అలాగే బొగ్గు నాణ్యత సామర్థ్యం పెంచే బొగ్గు ఉత్పతి అ యేలా చూడాలని అలాగే ఉద్యోగులకు రక్షణ పరమై న జాగ్రత్తలు, రక్షణతో కూడిన ఉత్పత్తి, రవాణా చేయాలని అన్నారు. అనంతరం జి.యం కార్యాలయం లో బాదావత్ వెంకన్న ని జి. యం వి.కృష్ణయ్య, ఇతర అధికారులు ఘనంగా సత్కరించారు.

తరువాత నూతన జే కే కోల్ మైన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలను పరిశీలించి రివ్యూ చేపట్టారు. నూతన ఓ. సి కి సంబంధించిన పనులను త్వరగా పూర్తిచేసి బొగ్గు రవాణా జరిగేటట్లు చూడాలని ఏరియా జీఎం కు తెలిపారు.

ఈ  కార్యక్రమం లో జే.కే కోల్ మై న్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎ.కృష్ణ మోహన్ రా వు, ఏ జియం ఐ ఈ డి గిరిధర్ రావు, ఏరియా సేఫ్టీ అధికారి జాకీర్ హుస్సేన్, డీజియం పర్సనల్ అజీర తుకారాం, డీ జియం (సివిల్) రవికుమార్, డీజియం(ఫైనాన్స్) మధు బాబు, వి.రామ మూర్తి, యస్.దిలీప్ కుమార్, కే.రామదాస్, ఆర్.సుధాకర్, అంజి రెడ్డి, వీరు నాయక్, నాగేశ్వర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.