19-10-2025 07:13:00 PM
ఉప్పల్ (విజయక్రాంతి): గంజాయి విక్రయిస్తూ ఓ వ్యక్తి పట్టుబడిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్తికేయ నగర్ స్మశాన వాటిక సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్న పక్కా సమాచారంతో నాచారం ఎస్ఐ వెంకటయ్య ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో దాడులు నిర్వహించారు.
ఈ క్రమంలో రాజు అనే వ్యక్తి అనుమానాస్పదగా సంచరిస్తూ ఉండగా పోలీసులు అడపులోకి తీసుకుని విచారించగా రాజు స్వగ్రామం నల్గొండ జిల్లా భువనగిరి అని స్నేహితులతో కలిసి ఛత్తీస్‌గఢ్ నుండి 5 కిలోల గంజాయిని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. నాలుగు కిలోలు తమ వాడుకొని మిగతా కేజీ అమ్ముతున్నట్టు రాజు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు రాజు నుండి 1188 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని రిమాండ్ తరలించారు. గంజాయి అమ్మకాలు చేపట్టిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని నాచారం పోలీసు హెచ్చరించారు.