13 July, 2026 | 6:25 AM

ఆర్టీసీ డ్రైవర్‌పై చెప్పుతో దాడి.. పోలీసులకు పట్టించిన ప్రయాణికులు

29-05-2024 05:45 PM

ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ యువకుడు చెప్పుతో దాడి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో చోటుచేసుకుంది. తాడికల్ గ్రామం వద్ద బస్సును ఆపి డ్రైవర్‌పై యువకుడు దాడి చేశాడు. దాడికి పాల్పడిన యువకుడిని గాలిపెల్లి అనిల్ గా గుర్తించారు. దాడి ఘటనపై ఆగ్రహించిన ప్రయాణికులు అనిల్ ను బస్సులోనే బంధించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.