ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
పాపన్నపేట, జూన్ 22 : ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాపన్నపేట శివారులో జరిగింది. ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. మండల పరిధి సోమ్లా తండాకు చెందిన బానోవత్ రాంసింగ్(78) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతని చిన్న కూతురు రేణుకను టెక్మాల్ మండలం ముత్యాల బంధం తండా కు చెందిన నరేష్ కి ఇచ్చి పెళ్లి జరిపించారు. కొన్ని రోజులుగా కూతురు, అల్లుడు మధ్య సంసారం విషయాల్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి.
మళ్లీ గొడవ జరగడంతో రేణుక పుట్టింటికి వచ్చింది. ఆదివా రం పాపన్నపేటలో అందరి సమక్షంలో రేణుకకు సముదాయించి ఆమె భర్త వద్దకు పంపేందుకు ప్ర యత్నించగా రేణుక అక్కడికి వెళ్ళేందుకు నిరాకరించింది. మనస్థాపం చెందిన రాంసిం గ్ ఆదివారం రాత్రి సమయంలో పాపన్నపేట గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అటుగా వెళ్లి న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థ లానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా హాస్పిటల్ కు తరలించి మృతుడి భార్య మీరి ఇచ్చి న ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.






