పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం వీడాలి
ఎస్జీపిఏపీఏటీ జిల్లా అధ్యక్షులు వి హనుమంత్ రెడ్డి
కామారెడ్డి, జూన్ 22 (విజయక్రాంతి): స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ తెలంగాణ ఎస్జీపిఏటి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా అధికారులు కేంద్రాలలో జిల్లా కలెక్టర్ కి సోమవారం పదవి విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో మెమోరాండం సమర్పించారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో కామారెడ్డిలో అసిస్టెంట్ కలెక్టర్ విక్టర్ కి ప్రజావాణిలో మేమో రాండం సమర్పించారు.
ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు.అనంతరం జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షులు హనుమంత రెడ్డి,రాష్ట్ర సలహాదారులు డాక్టర్ జీ లచ్చయ్య, ప్రధాన కార్యదర్శి విజయరామరాజు లు మాట్లాడారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే పోరాటానికి సిద్ధంగా ఉండాలని రిటైర్డ్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు శంకరయ్య, కార్యదర్శులు రవీందర్, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, రాజ లింగయ్య ,సత్తయ్య లు పాల్గొన్నారు.






