15-10-2025 08:50:53 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నెల మండలం గంగారం గ్రామానికి చెందిన కడారి బక్కన్న(41) అనే వ్యక్తి అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ బుధవారం తెలిపారు. గ్రామంలో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పంట వేశాడని, పంట నష్టం వాటిల్లడంతో చేసిన అప్పు ఎలా చెల్లించాలని బాధపడుతూ ఉండేవాడని తెలిపారు. ఈ నెల 3న ఇంట్లో గడ్డి మందు సేవించడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం కు తరలించి చికిత్స అందిస్తుండగా బుధవారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య కడారి మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.