15-10-2025 08:53:17 PM
భద్రాచలం (విజయక్రాంతి): రోజురోజుకు భద్రాచలం దేవాలయం సందర్శన కోసం వచ్చే భక్తులు పెరుగుతూ ఉండటంతో టూరిజం శాఖ కూడా స్పందించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా వారికి సహాయ సహకారాలు అందించడానికి వారి రక్షణ కోసం ఏడుగురు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసింది. పూర్తిగా టూరిజం శాఖ వారి సౌజన్యంతో భద్రాచలం దేవస్థానం ఈవో పర్యవేక్షణలో వీరు దేవస్థానం పరిసరాలలో ఉంటూ భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలిగిన వెంటనే వారి చేతనైనంత సహాయం అందించడమే కాకుండా ఈ విషయం దేవస్థానం ఈవో కి తెలియజేసి అదనపు సహాయం అందించేందుకు కృషి చేస్తారు. బుధవారం నాడు ఒక మహిళ కానిస్టేబుల్ తో పాటు ఆరుగురు కానిస్టేబుల్స్ దేవస్థానం ఈవో దామోదర్ రావుని కలిసి డ్యూటీలో జాయిన్ అయ్యారు.