11-08-2025 02:01:57 AM
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాం తి): రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు బీజేపీ ప్రత్యమ్నాయంగా మారుతోందని, అందుకే నేతల చూపు బీజేపీ వైపు ఉందని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు.
ఆయనకు రాంచందర్‌రావు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని, ఇది చూసే బాలరాజు పార్టీలో చేరారని తెలిపారు.
ప్రధాని మోదీ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, దేశాభివృద్ధి కోసం చేస్తున్న సుపరిపాలనకు ఆకర్షితులై అనేక మంది బీజేపీలోకి వస్తున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 13.9శాతం ఓటు శాతం సాధించగా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 36 శాతానికి పైగా ఓటు శాతం పెరిగి.. 8 ఎంపీ సీట్లలో గెలిచినట్లు తెలిపారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ 2 సీట్లు కైవసం చేసుకుమన్నారు.
పాలనపై దృష్టి పెట్టండి
రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్లపై దృష్టి పెట్టడం బదులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌పై దృష్టి సారించి హైదరాబాద్ అభివృద్ధిపై శ్రద్ధ పె ట్టాలని రాంచందర్‌రావు సూచించారు. ఓ వైపు వర్షాలతో రాష్ట్రం అస్తవ్యస్తమవుతుం టే.. సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. గేట్‌వే ఆఫ్ హైదరాబాద్ అం టూ మాటలు చెబుతున్నారని వాస్తవంగా పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు.
భవిష్యత్తులో రాష్ట్రం బీ జేపీకి “గేట్‌వే ఆఫ్ తెలంగాణ” అవుతుందన్నారు. తాను బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని నెలరోజులు గడిచిందని, ఇప్పటికే 16 జిల్లాల్లో 3,500 కి.మీ. మేరకు పర్యటించినట్లు వెల్లడించారు. ఎక్కడికెళ్లినా ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు వంటి అనేకమంది పార్టీలో చేరారని తెలిపారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఫెయిల్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తీవ్రమైన అవినీతి, కుటుంబ పాలన, నిరంకుశ పాలన ప్రజలను విసిగించాయని, కాంగ్రెస్ ప్రజలు నమ్మి అధికారంలోకి తెస్తే 19 నెలల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆ యన విమర్శించారు. ఆ రెండు పార్టీలు ప్రజావ్యతిరేక విధానాలతో మోసం చేశాయన్నారు. ఇప్పుడు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజా స్పంద న చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజ లు బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తారనే నమ్మకముందన్నారు.
రాహుల్ ఓ ఫేక్ ఇండియన్
రాహుల్ గాంధీ “ఫేక్ ఓట్లు”, “ఓట్ల చోరీ” అంటూ కొత్త రాగం అందుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలం గాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఫేక్ ఓట్లు ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశా రు. మహారాష్ర్ట, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత, బీహార్‌లో కూడా ఓడి పోతామని తెలిసిన తర్వాత రాహుల్ ఫేక్ ఓట్ల పేరిట తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని ఆరోపించారు.
అసలు ఆయన ఒక ‘ఫేక్ ఇండియన్’ అంటూ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సీనియర్ నాయకులు ఆచారీ, ప్ర ధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, కోశాధికారి శాంతికుమార్, అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌ఛార్జి ఎన్.వి.సుభాష్, అధికార ప్రతినిధులు సోలంకి శ్రీనివాస్, కట్టా సుధాకర్, కార్యవర్గ సభ్యుడు దిలీపాచారి, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రజలను వంచించాయి: గువ్వల
రాష్ట్రంలో గత దశాబ్దాలుగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రజలను వంచించాయని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. ప్రతి కాషాయ సైనికుడు, బీజేపీ నాయకుడు, కార్యకర్త అద్భుతంగా పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. అన్ని అంచనాలు వేసుకునే బీజేపీలో చేరినట్లు తెలిపారు. ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీలోకి చేరినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ ‘గరీబీ హటావో’ అనే నినాదాన్ని ఇచ్చి, దేశాన్ని అమ్ముడు పెట్టడానికి, తాకట్టు పెట్టడానికి, విదేశీ నాయకత్వాన్ని మనమీద రుద్దడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు తనకు దళితుల అంశాలపై మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చేవారని తెలిపారు. మళ్లీ ఎమ్మెల్యే, ఎంపీ కావాలని, నామినేటెడ్ పదవులు కావాలని కోరుకోవడం లేదని, బీజేపీ కుటుంబంలో ఒక సామాన్య కార్యకర్తలా తన ప్రయాణం మొదలుపెడతానని స్పష్టంచేశారు.